ఇది కేవలం ఆరంభం మాత్రమే ... ఎం పి ల తోలి అడుగు ఫలించింది. ఒక రకంగా ఇన్నాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఇంట్లో పడుకుని , నిద్రోలో కెళ్ళి లేచివచ్చి కార్యక్రమం లో కూర్చున్న ఎం . పి . లకు ఈ విజయం తో కాస్త దమ్ము దైర్నాలు వచ్చాయి. లేదంటే తగని చెడ్డ పేరు మూటగట్టుకు పోయే వారు . ఐతే ఇది ఆరంభం మాత్రమే... అసలు కథ శ్రీ కృష్ణుని నివేదిక తరువాత ఉంటది. అప్పటికి మల్లి నిద్ర లోకి జారితే వీళ్ళను తెలంగాణా ప్రజలు నేరుగా పాడే పైకి తీసుకెళ్లడం ఖాయం . అందుకే నేమో తోదరగానే పసిగట్టి నిరాహారులై కూర్చున్నారు.
ఇదొక శుభ పరిణామమే అటు కే.సి.ఆర్...పొద్దుమాపు చవటలు, దద్దమ్మలు, సన్నాసులు ..అంటూ తిట్టి పోస్తుండడం కోడా వీరిని కదిలించింది. ఇలా ఐతే నిజంగానే చవటలు , దద్దమ్మ ల్లాగా మిగిలి పోవాల్సి ఉంటుందని , గుర్తించారు. ఏదేమైనా తెలంగాణా రాజకీయ పార్టీలు నాయకులు నివేదికకు ముందే ఒక్క తీతి పైకి ఒక అవగాహనకు రావడం తెలంగాణా ఉద్యమానికి కొంత ఊరట కలిగిస్త్రుంది.
ఇంకా కూడా ఎవడైనా చవట దద్దమ్మ సన్నాసి ఉంటె మేల్కొంటే మంచిది.
0 comments:
Post a Comment