తెలంగాణ అంతటా ముందు చూపుతో పనులు నడుస్తున్నాయి. విద్యా, వ్యాపార సంస్థలు ముందు ముందుగానే వారి పనుల్ని చక్కబెట్టుకుంటున్నరు . డిసెంబర్ లో జరగబోయే ఉద్యమం కోసం సమాయత్తమవుతున్నరు. ఇప్పటికే పాటశాలలు, కళాశాలల్లో సిలబస్ లు పరిగెడుతున్నాయి. ఆ మేరకు యాజమాన్యాలు సంకేతాలు కూడా పంపాయి.
మొన్నటి ఉపఎన్నికల ఫలితాలతో ప్రజలు ఒకమారు పాలకులకు జలక్ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వకుంటే ఏమవుద్దో ఇప్పటికే జబర్డస్తు సందేశం పంపారు. ఆ మేరకే కాంగ్రెస్ పెద్ద తలలు కొంచం స్వరం పెంచి మాటలు పేలుతున్నరు. వారికే గాదు ప్రతీ పార్టీ నా కొడుకులకు విషయం చాలా బాగా అర్ధమయ్యింది. రేపు డిసెంబర్ తరువాత మన పరిస్థితి ఏంది ...? ఇప్పుడు మనం మౌనంగా వుంటే రేపు యాడ జాగుండుడు ...? సుమారు వట్టని పరిస్థితి లో వున్నరు .
తాడో పేడో తేల్చుకోవడానికి నాయకులు గాదు ప్రజలే సిద్దంగా వున్నరు. ఎంబట అచ్చిరా మంచిది లేదంటే ఇంకా వానికంటూ ఏ భవిష్యత్తు మిగలదు...!
అందుకే ప్రజలు రాబోయే పోరాటానికి అన్ని విధాలా సిద్ధమవుతున్నరు. ఆ మేరకు కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాసంఘాలు, JAC లు పని మొదలు వెట్టిండ్రు. తెలంగాణ అంతటా ప్రజా సదస్సులు జరుగుతున్నాయి.
తెలంగాణ బిడ్డ లారా ఎక్కడున్నా సిద్దం గా వుండండి.

0 comments:
Post a Comment